పరిపాలన చేత కాకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు జగన్ రెడ్డి తెలుగు యువత పాలకుర్తి దివాకర్ రెడ్డి.

0
135

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండలం రాష్ట్రంలో పరిపాలన చేయడం చేత కాకపోతే దిగి పోవాలి కాని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని ఏరిగేరి గ్రామంలో క్లస్టర్ ఇన్ చార్జ్ వెంకటపతి రాజు, బాపురం, డమ్మలదిన్ని, అగసలదిన్ని గ్రామాలలో క్లస్టర్ ఇన్ చార్జ్ అడివప్ప గౌడ్ అధ్వర్యంలో జరిగిన ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ పార్టీ అన్ని వస్తువులు ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం పద్ధతి కాదు అని వైయస్సార్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హౕమీలలో అధికారంలోకి వచ్చి ఇపుడు ప్రజలను మోసము చేసి తుగ్లక్ పాలన కొనసాగిస్తూ కాలయాపన చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని పాలకుర్తి దివాకర్ రెడ్డి ప్రజలకు వివరించారు రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది ప్రజలకు మేలు జరుగుతుంది అని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి బాపురం శివ మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, డాక్టర్ రాజానంద్, ఏరిగేరి బసవరాజు, హల్వి ఉసేని, ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్ డేని, వీరేష్, డేవిడ్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here