ఏలేశ్వరానికి చెందిన 14 వ వార్డు కౌన్సిలర్, న్యాయవాది అయినా మోదీ నారాయణస్వామి ఔధర్యానికి సహచర న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చెల్లంకూరి రామకృష్ణ మాట్లాడుతూ నారాయణస్వామి లక్షలాది రూపాయలు విలువచేసే స్థలాన్ని గ్రంధాలయానికి దానం చేయటంతో పాటు గ్రంథాలయ భవన నిర్మాణాలకు విశేష కృషి చేయడం హర్షనీయమన్నారు. ఆయన తాతయ్య గారి పేరుతో ఎం ఎన్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిట్టంశెట్టి పుల్లయ్య, ఏ కుక్కుటేశ్వరరావు, బాధ జాన్ బాబు, గంగాధర్, పలివేల నాగేంద్ర రాజు, కాకరపల్లి దుర్గాప్రసాద్, సూరిబాబు, గ్రంథాలయ పాలకుడు కవికొండల సత్యనారాయణ ఉన్నారు.