ఆంధ్రన్యూస్ : బిజెపి,విశ్వహిందూ పరిషత్ వాళ్లు టీచర్ ని అడిగిన వినాయక చందా ఇవ్వనందుకే ఆగస్టు నెలలో జరిగిన విషయాన్ని పనిగట్టుకొని 4నెలల తర్వాత ఇప్పుడు సరస్వతిని టీచర్ కించపరిచాడనీ మరియు విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదని అ టీచర్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఏ ఐ పి ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మన్నె కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఆ టీచర్ పై ఫిర్యాదు చేయాలనుకుంటే సంభందిత అధికారులకు తెలియజేయాలి కానీ ఆ టీచర్ ని అవమానించి బలవంతంగా గుళ్ళోకి తీసుకెళ్ళి బొట్టు పెట్టి క్షమాపణ చెప్పించడం దుర్మార్గం అన్నారు. విద్యాలయాల్లో మతోన్మాదుల ప్రమేయం సిగ్గు చేటని అన్నారు.విద్యార్థులకు సిలబస్ లో ఉన్న పాఠం చెబితే వీరికొచ్చే ఇబ్బంది ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు. విద్య శాఖ అధికారులు విద్యాసంస్థలలో లౌకిక విలువలను కాపాడాలని, రాజకీయ, మత సంఘాల ప్రమేయాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. తక్షణమే టీచర్ విధులకు ఆటంకం కలిగించి,బలవంతంగా గుళ్ళోకి తీసుకెళ్ళి బొట్టు పెట్టి అవమాన పరిచిన వారందరినీ పోలీసులు గుర్తించి చట్టరీత్య చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ పి ఎస్ యూ రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్, జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు సాయికుమార్, శివ,శేఖర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు
దాడిని ఖండిస్తున్నాం – ఏఐపిఎస్ యు.
RELATED ARTICLES