ఆంధ్రన్యూస్ : తొండంగి. కాకినాడ జిల్లా ఎస్పీ M రవీంద్రనాథ్ బాబు , IPS. వారి ఆదేశాల ప్రకారం, యస్ఐ రవికుమార్ పర్యవేక్షణలో తొండంగి మండల మహిళా పోలీస్ లు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలలో ప్రజలకు లోన్ యాప్ పై అవగాహన సదస్సులు నిర్వహించి, ఎవరైనా లోన్ యాప్ రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్టబద్ధత లేని యాప్స్ నుండి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురౌవుతారని, ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద వ్యక్తిగతంగా హాజరై మాత్రమే అవసరమైన రుణాలు తీసుకోవాలని తెలియచేసారు. నకిలీ యాప్స్ నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో చెల్లించకపోతే వడ్డీకి చక్రవడ్డి దానిపై బారువడ్డీ లేట్ ఫీజులు, పెనాల్టీల రూపంలో ఇచ్చిన దానికంటే నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తారని, ఎవరైన ఈ రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు, డయల్-100 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అలాగే ఎవరైనా సైబర్ మోసానికి గురైనప్పుడు 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తొండంగి యస్ఐ రవికుమార్ తెలిపారు తెలియజేశారు
తొండంగి మండలంలో లోన్ యాప్స్ పై అవగాహన కార్యక్రమాలు.
RELATED ARTICLES