కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం పరిధిలో నీ ఉరుకుంద గ్రామానికి చెందిన మలిగె రామాంజనేయులు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం మృతిచెందారు.విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి తనయులు పాలకుర్తి దివాకర్ రెడ్డి మృతి చెందిన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పి ఇచ్చారు.మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఇందులో కురుగోడు, సర్పంచ్ సురేంద్ర,కావలి ఈరప్ప, నరసింహులు,ఆటో ఈరప్ప,ప్రకాష్,జయప్ప, ఐటీడీపీ నీలకంఠ, ఉసేన్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.