రాజమహేంద్రవరం : 2024 ఎన్నికల్లో జగన్, చంద్రబాబు కు వేసే ప్రతి ఓటు బిడ్డలను చంపుకోవటానికే నని మరువకండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రమైన మనస్తాపంతో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయ పార్టీలుగా చలామణి అవుతున్న జగన్, చంద్రబాబు లు ఢిల్లీలో రహస్య ముచ్చట్లు తోను, అవినీతి రాజకీయ ఒప్పపందాలతోను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను మోది రాజకీయ బ్లాక్మయిలింగ్ టన్నులకొద్ది అమ్మేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో జగన్ చంద్రబాబు పార్టీలు ఒకరినొకరు తిట్టుకునేది ఆంధ్రులను వెర్రి పుష్పాలను చేయటానికేనని, జగన్, చంద్రబాబు ఒప్పందాలు వారి స్వంత ప్రయోజ నాలకు ఉపయోగపడే విధంగా చాలా బలంగానే వున్నాయని, ఈ ఆటలో ఓడిపోయేది ఆంధ్రరాష్ట్ర ప్రజలే నని, జగన్, చంద్రబాబు రాజకీయ భవిష్యత్ కు ఆంధ్రప్రదేశ్ బిడ్డలే ముడిసరుకు అని, ఢిల్లీలో చంద్రబాబు, జగన్ లలో మోదికి ఒకరు కాళ్ళు కడుగుతుంటుంటే, మరొకరు మూతి తుడుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లెక్కకు మించిన ఎచ్చులతో డాంబికాలు పలుకుతు ఆంధ్రుల శ్రమను, భవిష్యత్ ను దోచుకుంటున్నారని, గతంలో సిపిఐ నారాయణ చిరంజీవిని ఉద్దేశించి చిల్లర బేరగాడు అని తప్పుగా శంభోదించారని, అసలు సిసలైన చిల్లర బేరగాళ్ళు జగన్, చంద్రబాబు పార్టీల అధినేతలే నని, ఆంధ్రప్రదేశ్ సుమారు 6 వేలకోట్లు విధ్యుత్ బకాయలంటు అసందర్భ ప్రేలాపనలు కేసీఆర్ మాట్లాడుతుంటే విభజన చట్టం ప్రకారం సుమారు 1 లక్షా 40 వేల కోట్లు పై బడి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన ఆర్ధిక వాటా కోసం కేసీఆర్ ను ప్రశ్నించే దమ్ము జగన్, చంద్రబాబు లకు లేదని, తన రాజకీయ ప్రయోజనానికి అవసరం అయ్యినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజల మధ్య విబేధాలు సృష్టించటం కేసీఆర్ కు కలిసొచ్చిన రాజకీయ రోగంగా మారిందని, సిగ్గులేని సొల్లు తో రాజకీయ ఉపన్యాసాలు కట్టిబెట్టి తెలంగాణా అభివృద్ధి పై దృష్టి సారించమని కేసీఆర్ కు ఆయన హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగం లో మోది కుట్ర వ్యూహం గెలుస్తుందని, జగన్ చంద్రబాబు ల్లో ఒకరు గెలిచి మోదీ కుట్రను గెలిపించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను, భావితరాల భవిష్యత్ ను ఘోరాతి ఘోరంగా ఓడిస్తారని,జగన్, చంద్రబాబు లకు భజన చేస్తున్న ప్రతి ఆంధ్రుడు తన కన్న బిడ్డల భవిష్యత్ ను ఆమ్నెస్తున్నట్టు భావించక పోవటం మెజార్టీ ఆంధ్రుల దురదృష్టం గా భావించాలని, ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ఉన్నతమైన అభివృద్ధి కోసం, సామాజిక భద్రత కోసం, కనీస వసతులు, సహజ వనరుల రక్షణ కోసం, మెలిక సదుపాయాలు కోసం మాట్లాడే నేతలు ఆంధ్రప్రదేశ్ లో లేకపోవటం బాధాకరని, రాష్ట్ర అభివృద్ధి కోసం సంపదను సృష్టించటం కోసం దృష్టి సారించకుండా అప్పులు, ఆర్ధిక నేరాలతో పాలన సాగిస్తున్న నేటి పాలకులను చూసి నపుంసకులు సైతం సిగ్గుపడుతున్నారని ఆయన చమత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ లో స్వపక్ష, విపక్ష పార్టి లు ప్రత్యేక యూనివర్సిటీ ద్వారా బూతులలో పి ఎహె డి లు దాటిపోతున్నారని, జగన్, చంద్రబాబు పార్టీలు వారి నేతలకు బూతులలో తర్పీదు నిస్తున్నారని, జగన్, చంద్రబాబు పార్టీలలో అర్హత గల ప్రజా ప్రతినిధి ఏ ఒక్కరైనా వున్నారా ! అని, వీరి బూతు పంచాంగాలకు ఇంటి వారు సైతం ఈసడించుకుంటు తప్పనిసరి పరిస్థితుల్లో తలవంచుకుని కాపురాలు చేస్తున్నారని, ఒకడికి మించిన వాడు మరొకడు ఆచంట మల్లన్న అనే సామెత వలే చంద్రబాబు, జగన్ లు సురాపానం గాళ్ళ తో పార్టీని నడిపించుకోవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం అని,ఆంధ్రులు పాలకులను ప్రోత్సహించక పోవటం కూడా ప్రజా తప్పిదంగా భావించాలని, చట్టాలు వున్నా అమలు చేసే వారందరు ఎక్కువ శాతం నిశానీలు, అవినీతి పరులు కావటం కారణంగా సత్వర న్యాయం భాదితులకు అందటం లేదని,ఆంధ్రప్రదేశ్ లో జగన్, చంద్రబాబు లు రచించిన శాసనాలే అమలవుతున్నాయని, భాదితులకు న్యాయం అందటం ఒక బ్రమగానే మిగిలిపోతుందని, చంద్రబాబు, జగన్ పార్టీల్లో మహిళా నేతలను చూసి సంసారిక మహిళలు ఆశ్చర్యానికి లోనైతు ముక్కు పై వేలు వేసుకుంటున్నారని, వీరి పార్టీల మహిళా నేతల భర్తలు నేను కాపురం చేస్తున్నది తను వివాహమాడిన మహిళ తోనేనా అని ఆశ్చర్యానికి లోనైతున్నారని ఆయన వాపోయారు
జగన్, చంద్రబాబు పార్టీల కారణంగా పసి పిల్లలు, యుక్త వయస్సు వారు పాడైతున్నారని, అమ్మా నాన్న అని పలికే నోళ్ళ నుండి నీయమ్మ నీ ఆలి అని, అంత కన్నా పెద్ద పెద్ద బూతులు కూడా మాట్లాడుతున్నారని,ఈ బూతు నేతల సొంత పిల్లలు సైతం వీరిని అసహ్యించుకుంటున్నారని, బూతు నేతల పిల్లల కారణంగా తోటి విద్యార్థులు కలుషితం అవుతున్నారని,నేటి బూతు నేతల కారణంగా పదవ తరగతి కే పిల్లలు బూతుబాట పడుతున్నారని, చిన్న వయస్సులోనే పోక్సో చట్టం బాధితులుగాను, నేరస్తులు గాను భవిష్యత్ ను పాడుచేసుకుంటున్నారని, చిన్న వయస్సులోనే అశాంఘిక నేరాల బాట పట్టి సాంఘిక నేరాలతో బంగారు భవిష్యత్ ను పాడుచేసుకుంటున్నారని, యుక్త వయస్సు పిల్లలు పాడటానికి సినిమా సంస్కృతి కన్నా నేటి రాజకీయ సంస్కృతి అత్యంత ప్రమాద కరంగా వుందని, అశ్లీలతకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గాంచిన ఆర్జివి ని జగన్, చంద్రబాబు పార్టి ల వారు నేడు మించిపోయారని, కొన్నాళ్ళకు హూ ఈజ్ ది బూతు లీడర్స్ ఇన్ ఇండియా అని గూగుల్ లో అడిగితే ఆంధ్రప్రదేశ్ అనే జవాబు వచ్చి రాష్ట్ర ప్రతిష్ట ను చంక నాకించే ప్రమాదం వుందని, మన రాష్ట్ర పరువు ప్రతిష్ట లను కాపాడుకోవటానికి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి ఆంధ్రులు కార్యోన్ముకులు కావాలని ఆయన కోరారు.
దండయాత్ర పదాలకు అర్ధం తెలియని వారు ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో ప్రాతినిత్యం వహించటం అవమానకరమని, శత్రు మూకలపైన, శత్రు దేశాల పైన జరిపేది దండయాత్ర అవుతుందని ఒకే రాష్ట్రం లో వుంటు చట్ట సభలను అవమాన పరిచే విధంగా జగన్, చంద్రబాబు పార్టీల వారు ఒకరినొకరు దుమ్మెత్తుకుని దండయాత్ర లంటు ప్రకటించుకోవటానికి సిగ్గు వేయటం లేదా అని, వీరికి పాలించే అర్హత వుందా అని, ఇలాంటి వారినా ఆంధ్రప్రదేశ్ చట్ట సభలకు ప్రజలు పంపుతున్నారు అని,ఓటును అమ్ముకోకుండా ఒకే ఒక్కసారి ఓటు హక్కును వినియోగించుకున్న నాడు ప్రజలకు కలిగే మేలు, ఓటరు ప్రతిష్ట, బిడ్డల భవిష్యత్ అత్యద్బుతంగా వుంటుందని నేటి పాలకుల రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను యుద్ధ ప్రాతిపాదికన కాపాడుకుంటేనే మనకు, మన బిడ్డలకు భవిష్యత్ వుంటుందని,
సేవ్ ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ నినాదం తో మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం రక్షించు కుందాం రండి తరలి రండి ఈ మహోన్నత ప్రజా ఉద్యమం లో భాగస్వాములు కండి అని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివిఆర్ మూర్తి, లంక దుర్గాప్రసాద్, వర్ధనపు శరత్ కుమార్, సిమ్మా దుర్గారావు, కారుమూరి యుగంధర్, కారుమూరి శిరీష, వాడపల్లి జ్యోతిష్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, అడపా శేషగిరి, ఆకుల మణికంఠ, తాళ్లూరి మణికుమార్, మట్టపర్తి తులసిరావు, కాకి శ్రీనివాస్, వడ్డి అశోక్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.