కౌతాళం, (ఆంధ్రన్యూస్)
ఏపీలో డిజిటల్ విద్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. బుధువారం రోజున కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు నిర్వహించిన ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. గాంధీజీ, సరస్వతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటి పడేలా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో డిజిటల్ విద్యలో భాగంగా ట్యాబ్ లు అందజేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి వీటిని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను దేశ స్థాయిలో చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ వడ్డే రాముడు, దాట్ల కృష్ణం రాజు, దేశాయ్ ప్రహల్లాద ఆచారి, ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజు గౌడ్, ఎంపీపీ అమ్రేష్, జడ్పిటిసి రాధమ్మ,సర్పంచ్ పాల్ దినకర్, ఏకంబరం రెడ్డి, గుర్రాజ గౌడ్, బాపురం గుర్నాథ్ రెడ్డి, ఎమ్మార్వో రామేశ్వర్ రెడ్డి, ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి,కౌతాళం మాజీ సర్పంచ్అవతారం, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి మరియు ఆయాశాఖ అధికారులు, ఆయా గ్రామ నాయకులు,ఉపాధ్యాయులు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.