Saturday, April 20, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాటీటీడీ చైర్మన్ గా దేరంగుల ఉదయ్ కిరణ్ నియామకం దాదాపు ఖరారు?

టీటీడీ చైర్మన్ గా దేరంగుల ఉదయ్ కిరణ్ నియామకం దాదాపు ఖరారు?

టీటీడీ చైర్మన్ గా దేరంగుల ఉదయ్ కిరణ్ నియామకం దాదాపు ఖరారు? రెడ్డి కులస్తులకు నో ఛాన్స్.. చైర్మన్ పదవికి పోటీ పడిన జంగా కృష్ణమూర్తి కి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవి చైర్మన్ పదవికి పోటీలో ఒకే ఒక్కడు దేరంగుల… టిటిడి చైర్మన్ పదవికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేరంగుల ఉదయ్ కిరణ్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది, మొన్నటి వరకు ఈ పదవికి సీఎం జగన్ వద్ద ముగ్గురు పోటీ పడ్డారు, వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వీరితోపాటు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్, ఈ నేపథ్యంలో కొత్తగా మేకపాటి రాజా మోహన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది, సీఎం పలు దఫాలు ఆలోచించి రెడ్డి కులస్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ చైర్మన్ ఇవ్వకూడదని దృఢ సంకల్పంతో ఉన్నట్లు సమాచారం, బీసీలకే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది, ఈ నేపథ్యంలో డేరంగుల ఉదయ్ కిరణ్ తో పోటీపడుతున్న మరో బీసీ నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి నాలుగు రోజుల క్రితమే బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టి దేరంగుల పదవి కి లైన్ క్లియర్ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం, ఇప్పటికే యాదవ కులానికి అన్ని రకాలుగా మేలు చేశామని, వడ్డెర కులానికి మాత్రం ఎలాంటి ఉన్నతమైన పదవి ఇవ్వలేదని వడ్డెర కులానికి చెందిన దేరంగుల అవకాశం కల్పించాలని తెలుస్తోంది, దేరంగుల ఉదయ్ కిరణ్ జగన్ వైసిపి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంటనే నడుస్తూ టిడిపి , జనసేన పార్టీలను ఎండగడుతూ బీసీలను ఏకత్రాటిపై తెచ్చి వారందరినీ వైసీపీ మద్దతు దారులుగా నిలిచేటట్లు కృషి చేశాడు, అంతేకాక జగన్ పాదయాత్ర లోను ఆయన వెన్నంటేనే నడిచి ఆయన మనసుని ఆకట్టుకున వ్యక్తి దేరంగుల ఉదయ్ కిరణ్ జగన్ మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు, అప్పుడే జగన్ దేరంగులతో మన పార్టీ అధికారంలోకి వస్తే పార్టీకి మీ సేవలు గుర్తించుకొని మీకు సముచిత స్థానం ఇస్తామని జగన్ ఆనాడు దేరంగులతో చెప్పిన మాటలను బీసీలంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు, ఇప్పటికే టిటిడి చైర్మన్ అన్యమతస్తులకి ఇచ్చారని ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, ఈసారి అలాంటి ఆరోపణలకు చెక్ పెట్టడానికి హిందువులకే ఇవ్వాలని, అయితే జగన్ ముఖ్యమంత్రి కావడానికి అనేక హోమాలు, యజ్ఞాలు చేసిన డేరంగుల ఉదయ్ కిరణ్ అయితే సరిపోతుందని ఆయన భక్తిపరుడని ,టీటీడీ చైర్మన్ గా ఎంపిక చేసినట్టు విశ్వాసనీయ సమాచారం , టీటీడీ చైర్మన్ గా డేరంగుల ఉదయ్ కిరణ్ నియమిస్తే బీసీలు జగన్ ను ఎన్నటికీ వీడేది లేదని కంఠ పదంగా చెబుతున్నారు, రాష్ట్రంలో వడ్డెర కులస్తులకు ఎవ్వరికీ ఇంతవరకు వైసీపీ పార్టీలో ఎటువంటి సముచిత స్థానం లభించినప్పటికీ ఇప్పుడు అదే కులానికి చెందిన దేరంగుల ఉదయ్ కిరణ్ కు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెడుతున్నారన్న వార్తలతో వడ్డెరలంతా హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు, సంక్రాంతి పండుగ తర్వాత డేరంగుల ఉదయ్ కిరణ్ కు టిటిడి చైర్మన్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments