(ఆంధ్రన్యూస్) కర్నూలు
టిటిడి చైర్మన్ గా దేరంగులకు దాదాపు ఖరారు అవుతున్న సమయంలో, జంగా కృష్ణ మూర్తి తీవ్రస్థాయిలో తనకి టీటీడీ చైర్మన్ పదవి రావాలని ప్రయత్నం చేసి, భంగపాటుపడ్డాడు,
భూమా కరుణాకర్ రెడ్డి ఈసారి ఇవ్వడానికి కుదరదని అధిష్టానం చెప్పినట్టు సమాచారం,
అధిష్టానం బీసీలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అది జంగా కృష్ణమూర్తినా, లేక దేరంగులనా అని తీవ్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ,అన్ని రకాలుగా బెరుజి చేశారు, అయితే ఇప్పటికే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ,ప్రస్తుత ఎమ్మెల్సీగా ,మరియు రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు,గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా, జంగా కృష్ణమూర్తి అనేక పదవులు అలంకరించారని,
ఈసారి డేరంగులకు ఇవ్వాలని ఆలోచించినట్టు సమాచారం,
జంగా కృష్ణమూర్తి గురజాల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి , నియోజకవర్గానికి సూపర చిత్తుడు, ఆయనకు ఈ నియోజకవర్గం దాటితే గుర్తింపు లేదు,
రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడైన గతంలో నుంచి వైసీపీ పార్టీ వాళ్లు దగ్గరయ్యారు, తప్ప వ్యక్తిగతంగా చరిష్మా లేదు,
అదే దేరంగుల ఉదయ్ కిరణ్ రాష్ట్రస్థాయి జాతీయస్థాయిలో తనకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు, రాష్ట్రంలో అన్ని జిల్లాలు అనేకసార్లు పర్యటించి, బీసీ కులా ప్రజల సమస్యలను తెలుసుకొని, పరిష్కారానికై పోరాటం చేశాడు, అనేక జిల్లాలలో రాష్ట్రస్థాయి బీసీ భారీ బహిరంగ సభలు హక్కుల కోసం పెట్టి, బీసీ గళం వినిపించాడు, బీసీ కుల నాయకులే కాక , చాలామంది బీసీ కులాల కార్యకర్తలు ,ఈన అభిమానులు ఉన్నారు, రాష్ట్రస్థాయి బీసీ నాయకుడిగా చరిష్మా తెచ్చు కున్న వ్యక్తి డేరంగుల ,ఇప్పటికే అన్ని జిల్లాలలో బీసీలలో పట్టు బిగించి ,వారందరినీ వైసిపి పార్టీ వైపు నడిచేలా పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషిచేసి 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల జయహో అనిపించారు,
ఇవన్నీ గమనించిన అధిష్టానం డేరంగుల వైపు మొగ్గు చూపారు, జంగా కృష్ణమూర్తి 65 సంవత్సరాలు, డేరంగుల యువకుడు 40 సంవత్సరాలు ,జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలు యువకులకు అవకాశాలు కల్పిస్తూవచ్చారు,
అందులో భాగంగా యువకుడికే టీటీడీ పట్టం కట్టాలని ఫైనల్ చేస్తున్నారని అధిష్టానం తెలుస్తోంది, పార్టీకి డేరంగుల ఉదయ్ కిరణ్ వల్ల ఉపయోగం ఉంటుందని భావించారు, టిటిడి చైర్మన్ రేసులో డేరంగుల ఉదయ్ కిరణ్ పై పేరు బయట రావడంతో వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హంగామా జరుగుతుంది ,ఈ వార్తలతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల నాయకులందరూ కూడా ఆనందాలు వెలవిరుస్తున్నారు, బీసీ లో అట్టడుగు కులాలకు చెందిన వడ్డెర కులం అందలమెక్కిస్తున్నారు, అనడంతో అన్ని వర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు,
బీసీ అగ్ర నేతలు అంతా కూడా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని టీటీడీ చైర్మన్ గా దేరంగుల ఉదయ్ కిరణ్ సరైన వ్యక్తిని భావిస్తున్నారు, చట్టాల పైన, రాజ్యాంగపైన , అవగాహన ఉన్న వ్యక్తి ,హక్కుల పైన పోరాడిన నేతకు సముచిత స్థానం కల్పిస్తున్నారు, ఆలస్యమైన జగన్ మంచి పదవి నీ కల్పించారని అంటున్నారు, టీటీడీ విలువలని హక్కులని కాపాడగల శక్తి డేరంగులకు ఉందంటూ, ప్రచారం జరుగుతోంది, ఇదే నిజమైతే సంక్రాంతి పండుగ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది,