కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం నదిచాగి గ్రామములోనీ జిల్లా పరిషత్ ఉన్నత కన్నడ పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వై బాలనాగీరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు రామన్నగౌడ, పాఠశాల ఛైర్మెన్ ముద్దనగౌడ, ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మినారాయణ అధ్యక్షతన ట్యాబ్ లు పంపిణీ చేయడం జరిగింది,కార్యక్రమంలో హెచ్ఎం మరియు ఎంపీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యొక్క ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తక్కువ కాకుండా బైజుస్ అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకుని అనుభవజ్ఞ శిక్షకుల ద్వారా విద్యను అందించనున్నారు, విద్యార్థులకు అందించిన శాంసంగ్ ట్యాబ్ లను విద్యార్థులు సక్రమంగా ఉపయోగించుకొని ఉన్నత చదువులు చేదువుతు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుతున్నట్లు రామన్న గౌడ తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రామన్న గౌడ, హెచ్ఎం లక్ష్మినారాయణ, పాఠశాల ఛైర్మన్ ముద్దనగౌడ,ఎంపీటీసీ లింగనగౌడ, సిఆర్పి రామన్న, ఉపాద్యాయులు శ్రీనివాస,మల్లికార్జున,శశికళ,యువరాజ్,షరీఫ్& విద్యార్ధులు ఉన్నారు.