రాజువొమ్మంగి మెట్టజ్యోతి అల్లూరి సీతారామరాజు జిల్లా మండల ఏజెన్సీ కేంద్రమైన రాజీవమ్మంగి టిడిపి అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు దంతులూరి శివరామచంద్ర రాజు ఈమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం మనకు తెలిసినదే, ఆపరేషన్ అనంతరం ఆయన ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సోమవారం రాత్రి బడదానాంపల్లి వచ్చి ఆయనను పరామర్శించారు, మండలానికి పెద్దదిక్కు అయినా మీకు ఇలా జరగడం చాలా బాధాకరమని తప్పనిసరిగా మీరు త్వరలో కోలుకొని మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని ఆమె అన్నారు, ఈ పరామర్శిలో మండల టిడిపి అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ముప్పన కేశవ్ టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు,