(కర్నూలు జిల్లా ఆంధ్రన్యూస్)
దేశ సమగ్రత,ఐక్యతకు కృషి చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి “ ఏక్తా దివస్“ను పురస్కరించుకొని దేశ ఐక్యమత్యాన్ని చాటుతూ ఏక్తా రన్ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ వారు జెండా ఊపి ప్రారంభించారు.
సోమవారం సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు.
పోలీసుశాఖ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం (కొండారెడ్డి బురుజు) నుండి ఏక్తా రన్ ప్రారంభమై రాజ్ విహర్ కూడలి వరకు భారీ ర్యాలీ గా కొనసాగింది.
పటేల్ గారి జయంతి,పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల చివరి రోజు సంధర్బంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ ఏక్తా రన్ ను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ వారు తెలిపారు.
అనంతరం రాజ్ విహార్ కూడలిలో సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ సిబ్బంది,క్రీడాకారులు,NCC విద్యార్దులచే ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగబాబు వారు“జాతీయ సమైఖ్యతా ప్రతిజ్ఞ” ను ఈ క్రింది విధంగా పలికిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.
దేశ ఐకమత్యం,సమగ్రత,భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని, అంతేగాక,ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని, సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను, సర్ధార్ వల్లబాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో,నా దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటు నందిస్తామని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాము.
ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగబాబు మాట్లాడారు.
ఏక్తా దివాస్ సంధర్బంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం భారీ ర్యాలీ గా ఏక్తారన్ నిర్వహించామన్నారు.
ఎంతో మంది నాయకులు ఉద్యమాలను నడిపి మనకు స్వేచ్చాయుత జీవనాన్ని అందించారన్నారు.జాతీయ భావాన్ని వారి సేవలను గుర్తు చేసుకుంటూ దేశ స్ఫూర్తిని , ఐకమత్యాన్ని చాటేందుకు ఈ ఏక్తా రన్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలన్నారు.
కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్ మాట్లాడారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని ఏక్తాదివాస్ ను జరుపుకుంటున్నామన్నారు.
పటేల్ గారి కృషి వల్లనే భారతదేశ రూపురేఖలు, దేశ సమగ్రత భావాన్ని అందరిలో ఇనుమడింప చేశారన్నారు.అందుకే ఆయనను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారన్నారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 ని ఐక్యతా దినమును ఘనంగా జరుపుకుంటూ ఈ సందేశాన్ని భావి తరాలకు అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్,అడిషనల్ ఎస్పీలు డి.ప్రసాద్,నాగబాబు,డిఎస్పీలు కెవి మహేష్,ఇలియాజ్ భాషా,రవీంద్రా రెడ్డి,పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి,సిఐలు,ఆర్ ఐలు,ఎస్సైలు,ఆర్ ఎస్సైలు,ఆర్మీ,సివిల్,ఎపిఎస్పీ,పోలీసు సిబ్బంది,ఎన్ సిసి, విద్యార్దులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.
(ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653)