నేడు వర్కింగ్ జర్నలిస్ట్స్ సమైక్య ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన నిర్మాణ సభ విజయవంతం…
(కర్నూలు ఆంధ్రన్యూస్)
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 4:- జర్నలిస్ట్ లపై దాడులు చేసేవారిని (భౌతిక, మానసికంగా, దూషించి,భయబ్రాంతులకు,గురిచేసినటువంటి )వారిపై నాన్ బెయిల్ బుల్ కేసులు బుక్ చేసి జర్నలిస్ట్ లకు పూర్తి స్థాయి రక్షణ కలిగించే చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య (ఏ,ఐ,డబ్ల్యూజేఎస్) జాతీయ అధ్యక్షులు చల్లగుండ్ల రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు… ఏపీడబ్ల్యూజేఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ సభ విజయవాడ భవానిపురం స్వాతి గార్డెన్స్ లో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశనికి ముఖ్య అతిధిగా హాజరైన జాతీయ అధ్యక్షులు చల్లగుండ్ల.రామకృష్ణ మాట్లాడుతూ చిన్న,పేద్ద పత్రికలు చానల్స్ అని తారతమ్యం చూపుతూ అక్రిడేషన్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వం పనితీరు నిరసిస్తూ పోరాట దిశగా పిలుపు ఇచ్చి సాదించేందుకు రూపకల్పన చేయడం జరిగింది.అయన మాట్లాడుతూ……
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి జర్నలిస్ట్ కు స్థలం కేటాయించి దానిలో పక్క ఇల్లు నిర్మాణం చేయాలి.
అక్రిడేసాన్ తో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు ఇల్లు మంజూరు చేయాలి.
కోవిడ్ బారినపడి చనిపోయిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి 50లక్షలు తక్షణమే సాయం చేయాలి.
నర్సరీ నుంచి పి.జి వరకు ఉచితం గా విద్యను అందించే కేంద్రియా విశ్వవిద్యాలయలు ఏర్పాటు చేయాలి లేదా అన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించాలి.
అన్నీరకలైన వ్యాధుల కు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్యం అందించాలి.
అనేక సంవత్సరాలు గా పాత్రికేయులు గా పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన ప్రతి జర్నలిస్ట్ కు వృధ్యాప్యపించను 5000/-రూపాయలు చెల్లించాలి.
ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు 2000/-రూపాయల గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లించాలి.
అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేసాన్ మంజూరు చేయాలి. రైల్వే పాస్, మండల,నియోజకవర్గ లలో పని చేస్తున్న జర్నలిస్ట్ లకు కూడా మంజూరు చేయాలి. పాత జీవో ప్రకారం అందరికి అక్రిడిటేషన్ ఇవ్వాలి. ఇలాంటి అనేక డిమాండ్లతో జర్నలిస్ట్ ల సమస్యలపై శంఖారావం పూరించడం జరిగింది. ఈ డిమాండ్లు పరిష్కరించని తరుణంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి చిరుమామిళ్ల రాము, రాష్ట్ర అధ్యక్షులు పామర్తి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. సమైక్యలో జర్నలిస్టులను రాష్ట్రవ్యాప్తంగా చేర్చుకునే కార్యక్రమం త్వరతగిన చేయాలని సమావేశానికి హాజరైన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నాయకులకు ఆదేశించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా నుంచి ఏపీడబ్ల్యూజేఎస్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ షుకుర్, వైస్ ప్రెసిడెంట్లు దర్శి సత్యనారాయణ, షేక్ దావూద్ మోహిద్దిన్, జాయింట్ సెక్రటరీలు గోడి నాగమణి, షేక్ షాకీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు