కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్లారు కానీ జగన్ రెడ్డి నీచమైన ముఖ్యమంత్రిని మా జీవితంలో చూడలేదని తెదేపా మంత్రాలయం సీనియర్ ఉలిగయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాత్రికి, రాత్రి జీవో తీసుకురావడం ఎక్కడ చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది నికోరకంగా, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా ఉండదని జగన్ రెడ్డి కు గుర్తు చేశారు. కుప్పంలో మా పార్టీ అధినాయకుడు చంద్రబాబునాయుడును
అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆనాడు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు మా అధినాయకుడు చంద్రబాబునాయుడు ఒక పిలుపు ఇచ్చి ఉంటే, ఆ రోజు నువ్వు పాదయాత్ర చేసే వాడివా అని ఘాటుగా విమర్శించారు. జగన్ రెడ్డి ఆంధ్ర నీ జాగీరా తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
ప్రతిపక్ష నాయకులకు ప్రశ్నించే హక్కు లేదా అన్నారు. ఈ మూడున్నర సంవత్సరాల నుండి మా గొంతు నొక్కడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని అన్నారు. ఇంతకు రాష్ట్రంలో అభివృద్ధి కనబడుతుందా అని ప్రశ్నించారు. 2024 సంవత్సరం లో ప్రజలే నిన్ను తరిమి తరిమి కొట్టి ఇంటికి పంపియడం ఇంటికి ఖాయమని అన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజాస్వామ్యం యొక్క విలువలు తెలుసుకోవాలని జగన్ రెడ్డి కు ఉలిగయ్య సూచించారు. లేకుంటే రాబోయే రోజుల్లో నీకు చిప్ప కూడు గతి పడుతుందని అన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు లక్కే గోవిందు, కురువ నాగేష్, సిద్దయ్య, దుర్గయ్య, మహతేష్, మనీ, ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.