కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం తోవి గ్రామము టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్క రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇంచార్జి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ అని ఎస్సీ కాలనీలో తోవి గ్రామంలో టిడిపి నాయకులు యువ నాయకుడు విజయ్ ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని మన రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు వారి ఫోనుతో 9261292612 మిస్సేడ్ కాల్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో సిసి రోడ్డు డ్రైనేజీ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నారు తాగునీటి సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి అని ప్రజలు కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరూ సమస్యలు నెరవేర్చమని నాయకుల అన్నారు. తోవి గ్రామ యువ నాయకుడు విజయ్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు అంధకారంలో ఉందని జగ రెడ్డి ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకం ఏర్పడిందన్నారు. ప్రజా, రైతు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పోలీస్ వ్యవస్థ అడ్డంగా పెట్టుకుని ప్రజలను నానా హింస చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తామని అభివృద్ధి అంటే చేసి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమములో తొవి గ్రామ టీడీపీ నాయకులు, సోమనాథ్ , యువ నాయకుడు విజయ్,భీమయ్య నారాయణా,కుమార్ మరియు గ్రామ నాయకులు. ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.