ఆంధ్రన్యూస్ : శంఖవరం. ఎన్టీఆర్ వంటి మహానీయులను అవమానించడం జగన్‌కి తగదని ఆయన పేరును హెల్త్ యూనివర్సిటీకి పునరుద్దరణ చేయకుంటే వరుపుల రాజా ఆద్వర్యంలో ఉద్యమిస్తామని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నా ఈశ్వరుడు (శివ) హెచ్చరించారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్‌కు మంచిబుద్ది కల్పించాలని సీతంపేట మీనాక్షి అమ్మవారికి పూజలు నిర్వహించారు. టిడిపితో రాజకీయ బిక్ష పొందిన కొందరు నీతిమాలిన నేతలు ఎన్టీఆర్ కుటుంబాన్ని విమర్శలు చెయ్యడం నీతిమాలిన చర్య అని అన్నారు. ఈకార్యక్రమంలో గాబు కృష్ణ, కొయ్యా రమణ, పిర్ల అప్పారావు, ఉగ్గిరాల నాగేశ్వరరావు, కొయ్యా వీరసత్తియ్య తదితరులు పాల్గొన్నారు.
జగన్‌కి మంచిబుద్ది కల్పించాలని అమ్మవారికి పూజలు
RELATED ARTICLES