Tuesday, February 7, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeఏలూరుజంగారెడ్డిగూడెంలో టిడిపి మండల కార్యాలయం ప్రారంభం

జంగారెడ్డిగూడెంలో టిడిపి మండల కార్యాలయం ప్రారంభం

మెట్టజ్యోతి( జంగారెడ్డిగూడెం) ఏలూరు జిల్లా. జంగారెడ్డిగూడెం మండలం గుర్వయిగుడెం గ్రామం లో శనివారం నాడు ఉదయం తెలుగుదేశంపార్టీ మండల కార్యాలయం అధ్యక్షులు సాయిల సత్యన్నారాయణ గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గన్ని వీరాంజనేయులు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీగన్ని వీరంజనేయులు జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు గ్రామ అధ్యక్షులు చిటికెన శ్రీను పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీ రామకృష్ణ గారు,ముప్పిడి వేంకటేశ్వర రావు గారు,నియోజక వర్గ పరిశీలకులు కోళ్ళ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ కొక్కిరిగడ్డ,జయరాజు గారు జయవరపు శ్రీరామమూర్తి గారు,Dr దాసరి శ్యామ్ చంద్ర శేషు గారు, గారు,పాలి ప్రసాద్ గారు,జగ్గవరపు ముత్తా రెడ్డి గారు, మండవ లక్ష్మణరావు గారు బొరగం శ్రీనివాస్ గారు,కోనేరు వెంకట సుబ్బారావు , నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు జంగారెడ్డిగూడెం టౌన్ మరియు రూరల్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, చింతలపూడి నియోజకర్గం గ్రామాల కమిటీ సభ్యులు,పరిసర గ్రామాల అభిమానులు, పార్టీ సభ్యులు భారీ ఎత్తున హాజరైనారు .ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో అందరి సహకారంతో భారీ విజయం సాధించాలని దానికోసం అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం చక్రదేవరపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో “కార్తీకమాస వన భోజనాలు” ఏర్పాటు చేయడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments