ఆంధ్రన్యూస్ : అనంతగిరి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ నియోజకవర్గం అనంతగిరి మండలం ఎగువ శోభ పంచాయతీ కె. జాంగుడ గ్రామం లో సోమేల సరుబు కుమారుడు సోమేల ధనరాజు వారం రోజుల క్రితం రోడ్డు యాక్సిడెంట్ కి గురై మరణించాడు ఈ యొక్క దుఃఖ సమయంలో
ఏ.కే ఎస్.ఎస్ గ్రూపు సభ్యులు కుటుంబ ఆదరణ కొరకు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా మానవత్వంతో దిన కార్యక్రమ అవసరానికి మూడు వేల రూపాయలు చనిపోయిన వ్యక్తి భార్య సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ సోమేల మధు పాంగి రాంబాబు ఏనికేల జగనాధం సాగర మధు సోమేల చిన్నారావు పాల్గొన్నారు.