కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళ మండల పరిధిలో కౌతాళం గ్రామంలోచంద్రబాబునాయుడుతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మండల తెదేపా అధ్యక్షుడు ఉలిగయ్య అన్నారు. కౌతాళం గ్రామంలో మంగళవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను వివ రించారు. జగన్ ప్రభుత్వం దగా ప్రభుత్వమని, ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిందన్నారు. నిత్యావసరాల ధరలు పెంచేసి ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా ప్రజలకు ఎలాంటి ఉప యోగం ఉండదన్నారు. రూ. లక్షలో కోత కోసి రూ. వేలల్లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతార న్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు , ధరల పెంపు, అరాచక పాలన, దాచుకో దోచుకో, ప్రభుత్వా ప్రజా వ్యతిరేకత గూర్చి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వివరిస్తూ సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య అధ్యక్షతన నీలకంఠ రెడ్డి, నరసింహ స్వామి మూర్తి , కురువ వీరేష్, ముకాయ్య, యంకోబా, పుగ్గి నాగ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు పల్లేపాడు రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరియు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు సిద్దప్ప హాల్వి , రామలింగన్న, సొట్టయ్య అన్న, ఈరన్న, మారెప్ప అన్న, నాగిరెడ్డి, గుండప్ప, అయ్య, భూషణ్ గౌడ్, బుడదొడ్డి అన్న, ముగుతి లక్ష్మయ్య,రాజు, లింగాన్న, మహంతేష్, సురేష్, ప్రకాష్, వీరారెడ్డి, మరియు మండలములో గ్రామ నాయకులు , కార్యకర్తలు ముఖ్యంగా పెద్ద ఎత్తున తెలుగు యువత, టి ఎన్ ఎస్ ఎఫ్ యువత పాల్గోనడం జరిగినది.