కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఎస్బిహెచ్ కాలనీ యందు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు ఎస్ ప్రతిభ భారతి నరసన్న అధ్యక్షతన సభ నిర్వహించారు ముఖ్య అతిథులుగా మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, బీసీ నాయకులు కే గణేష్, యు రాము, పూలే అంబేద్కర్ ఐడియాలజీ కన్వీనర్ ఎసి దేవదానం,
ఏ భాస్కర్, బహుజన వ్యాసకర్త రంగస్వామి, గవర్నమెంట్ కాంటాక్ట్ జూనియర్ లెక్చరర్స్ రాష్ట్రఅసోసియేషన్ అధ్యక్షులు మాదన్న,బి టి ఏ రాష్ట్ర కార్యదర్శి పూలేఅంబేద్కర్ చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బహుజన ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మనువాదం విధించిన ఆంక్షలు ఫలితంగా వందల సంవత్సరాలు విద్య ఉద్యోగం ఆస్తి రాజ్యాధికారం సమానత్వం సామాజిక హక్కులకు దూరమై దుర్భరమైన జీవితాలు జీవించారు మనువాదం పై మహనీయులైన గౌతమ బుద్ధుడు సంత్ కబీర్ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు పెరియర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జీవితాలను త్యాగం చేసి బహుజన జీవితాలలో వెలుగుల నింపారు పై హక్కులను భారత రాజ్యాంగంలో చట్టబద్ధత చేశారు బి.ఆర్ అంబేద్కర్ గారు.భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తెలియజేశారు భారత రాజ్యాంగంలో మనకు ఒక వజ్రాయుధాన్ని అదే ఓటు హక్కు ఈ ఓటు హక్కును ఆనాడు మనము ఎవరినైతే గొప్పగా చెప్పుకుంటున్నామో గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చదువుకున్న వారికి టాక్స్ కట్టే వారికి ఓటు హక్కు ఇవ్వాలని ప్రతిపాదించారు బిఆర్ అంబేద్కర్ గారు వారితో విభేదించి ఈ దేశంలో ఉన్న నా బహుజన ప్రజలకు 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కును ఇవ్వాలని పట్టుబట్టి మనకు సాధించి ఇచ్చారు మనమేమో ఓటు విలువ తెలియక డబ్బులకు సరాయికి అమ్ముకొని బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం ఓటు విలువ తెలుసు కాబట్టే అగ్రకుల నాయకులు డబ్బులతో మన ఓట్లను కొని రాజ్యమేలుతున్నారు మేల్కోండి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చేది మన దేశ భవిష్యత్తును మార్చేది మన హక్కులను కాపాడేది మనము వేస్తున్న మన ఓటే ఇప్పటికైనా అర్థం చేసుకుని మేల్కొని భారత రాజ్యాంగాన్ని కాపాడే పార్టీకి మన మద్దతు ఇవ్వాలని అన్నారు గుడికల్ సర్పంచ్ ఎంనాగేష్ కడివెల్ల సర్పంచ్ బి రంగస్వామిబహునజన నాయకులు జయరాజు బజారి ఆదాము చిన్న ప్రశాంతు ఎం హుసేని ఎంనరసప్ప పందికోన ఈరన్నసొసైటీ కమిటీ సభ్యులు sరాజు k నాగరాజు mబాబు రాజుబహుజన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ 73వ దినోత్సవ సభ.
RELATED ARTICLES