ఆంధ్రన్యూస్ : అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీరుళ్ళమ్మ జాతరకు రాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా శాసనసభ్యులు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ అధ్యక్షులు రంగంపేట మండలం ఇంచార్జ్ నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, వీరుళ్ళమ్మ కమిటీ అధ్యక్షులు సత్తి వెంకట రామారెడ్డి, వీరుళ్ళమ్మ కమిటీ సత్తి రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి కర్రి ధర్మారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తేతలి నారాయణరెడ్డి, పడాల కళ్యాణ్ రెడ్డి, మేడపాటి వెంకటరమణ రెడ్డి, మేడపాటి రామకృష్ణారెడ్డి, మేడపాటి శివశంకర్ రెడ్డి, మిలట్రీ రెడ్డి, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.