ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ మండల వ్యాప్తంగా ఉన్న జూదము గుండాటలపై విస్తృత దాడులను సోమవారం నిర్వహించారు. మండలంలోని ఏలేశ్వరం, తిరుమాలి, జె.అన్నవరం, లింగంపర్తి,సిరిపురం గ్రామాలలో గుండాట,జూద శిబిరాలపై ఆకస్మిక దాడులను నిర్వహించి, గుండాట బోర్డులు, టెంట్లును తొలగించారు. జూదమగుండట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ జి సుబ్బిరెడ్డి, కానిస్టేబుల్స్ లోవరాజు, సుకుమారు, బ్రహ్మానందం, వెంకటరమణ పాల్గొన్నారు.
గుండాట శిబిరాలపై విస్తృత దాడులు
RELATED ARTICLES