నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి.
మెట్టజ్యోతి: అనకాపల్లి. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షణకు భక్తులకు దారి పొడుగునా అన్ని సదుపాయాలు కల్పించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ తో కలిసి సింహాచలం నుండి హనుమంతవాక వరకు పర్యటించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షణకు లక్షలాదిమంది భక్తులు వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తుల కొరకు త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు మొదలైనవి జీవీఎంసీ తరఫున ఏర్పాటు చేశామని తెలిపారు. సింహగిరి 32 కిలోమీటర్ల పొడవునా ప్రతి పాయింట్ లోనూ త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, రూ.17 లక్షల వ్యయంతో 650 లైట్లు ఏర్పాటు చేశామని 70 చోట్ల డార్క్ స్పాట్ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పాయింట్ను మేయర్ స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ లో పాల్గొని గిరి ప్రదర్శన భక్తులకు ప్రసాదాన్ని మేయర్ అందించారు. గిరి ప్రదర్శన లో నిషేధిత ప్లాస్టిక్ కు అనుమతి లేనందున భక్తులకు ప్రసాదం అందించే దాతలు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రసాద వితరణ చేస్తున్నారని తెలిపారు. గిరి ప్రదక్షణ వచ్చే భక్తులు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యర్థాలను విచ్చలవిడిగా వేయకుండా జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని భక్తులకు సూచించారు.అనంతరం జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మిశ మాట్లాడుతూ, గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామని, త్రాగు నీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులాంటి పనులు పూర్తిచేశామని, జీవీఎంసీ నుండి చర్యలను రోడ్ మ్యాప్ ద్వారా మేయర్ కు కమిషనర్ వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, రాత్రి నడిచే భక్తులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలంకరణ చేశామని తెలిపారు