కౌతాళం డిసెంబర్ 08 ఆంధ్రన్యూస్ కౌతాళం మండల పరిధిలోని గోతుల దొడ్డి గ్రామంలో మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్లో నేడు ఆంధ్ర మొదటి స్థానంలో నిలిచిందంటే వైయస్సార్ ప్రభుత్వం.. జగన్ రెడ్డి సిగ్గుపడాలి.. గంజాయి స్మగ్లర్లకి వైయస్సార్ ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహిస్తుందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.. అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్న ఆంధ్ర నేడు గంజాయి స్మగ్లింగ్ లో స్మగ్లింగ్ ఆంధ్ర ప్రదేశ్ గా తయారైంది.. త్వరతగతిన ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని అరికట్టకపోతే దీనిమీద తెలుగుదేశం పార్టీ తరఫున మరింతగా ఉధృతం చేస్తాం.. వైయస్సార్ ప్రభుత్వం చేస్తున్న ఈ నీచ రాజకీయాలను ప్రజలకు తెలిసేలా చేస్తాం.. వైయస్సార్ ప్రభుత్వం గద్దె దిగే వరకు తెలుగు యువత పోరాటం చేస్తూనే ఉంటాం…. ఇదేమి కర్మ రాష్ట్రానికి అని జనం గుండెల్లో నాటుకపోయేలాగా పోరాటం కొనసాగిస్తాం… ఈ కార్యక్రమములో రామాంజినేయులు, గొట్టయ్య, రహిమన్, కృష్ణ, గురు, తోవి విజయ్. శ్రీరామ్,నాగరాజు ,లింగెష్, మౌనేస్, మణికంఠ, దుర్గయ్య, మైబు మరియు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823