(కౌతాళం ఆంధ్రన్యూస్)
మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం గ్రామంలో వైయస్సార్ బీమా పేదలకు వరం లాం గుటిదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగపు నాయకుడు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కౌతాళంలో ఎనిమిదో వార్డ్ మెంబర్ ప్రమీలమ్మ భర్త పవన్ అలియాస్ పౌలు మృతి చెందాడు. వైయస్సార్ భీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్ ఆర్ భీమా ద్వారా మంజూరైన తక్షణ సహాయం 10,000/- రూపాయలు మరియు ఎమ్మెల్యే శ్రీ బాలనాగిరెడ్డి సహాయం నిమిత్తము 15,000/- లను నామిని అయిన ప్రమీలమ్మ గారికి యువ నాయకుడు శ్రీ ప్రదీప్ రెడ్డి చేతుల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ వార్డ్ మెంబర్ అయిన ప్రమీలమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఎల్లప్పుడు అండగా ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చైర్మన్ దాట్ల కృష్ణంరాజు మరియు సర్పంచ్ పాల్ దినకర్, యువ నాయకులు దాట్ల సుబ్బరాజు, రాఘవేంద్ర రెడ్డి, ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ కమిటీ డైరెక్టర్ వెంకోబ, మాజీ సర్పంచ్ అవతారం, ఉప సర్పంచ్ సక్కరి తిక్కయ , వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి, వడ్డే రమన్న, సమాద్, వార్డ్ మెంబర్, సీమోను, ఉన్రామకృష్ణ, ఇద్రుస్ మరియు మాజీ ఉపసర్పంచ్ ఉమాపతి , వడ్డే ఉసేనీ మరియు ఉలిగప్ప, కార్యదర్శి, ఆంజనేయులు, వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మి, పలువురు నాయకులు పాల్గొన్నారు.