కౌతాళం అక్టోబర్14( ఆంధ్ర న్యూస్) కౌతాళం మండల పరిధిలో బదినేహాల గ్రామం కంబళి తాత దగ్గర వంక బ్రిడ్జి అధిక వర్షాలకు కూలిపోయి రెండు సంవత్సరాలైనా ఆర్ అండ్ బి అధికారులకు ,వైసీపీ నాయకులకు కనప దాఅని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ మేలిగిరి ఈరన్న అన్నారు.
ఈ రోడ్డు ఎరిగేరి నుంచి బదినే హాలు, కుంటనహాలు, ఉప్పర హాలు, రౌడూర్ కర్ణాటక చెక్ పోస్ట్ నుంచి కర్ణాటకకు, బాపురం నుంచి నది ఛాగి వరకు అక్కడి నుంచి కర్ణాటక బార్డర్ వరకు రోడ్డు ఉన్నది. అయినా మండలంలో నాయకులు రోడ్లన్నీ పాడైపోయిన పట్టించుకునే వాళ్ళు లేరు అని అన్నారు. కంబళి తాత బ్రిడ్జి అధిక వర్షాల కు కూలిపోవడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు, పొలాలకు పోయే రైతులకు మూడు, నాలుగు వేల ఎకరాలు భూములు అటువైపు ఉన్నాయి .ఆ రైతులందరూ చాలా అవస్థలు పడుతున్నారు అని ఆయన అన్నారు. విద్యార్థులైతే బస్సు లేకపోవడం వల్ల బడినేహాల్ రావడానికి చాలా ఇబ్బంది పడుతూ కొంతమంది పిల్లలు అయితే స్కూలుకు రాలేకపోతున్నారు .నెల ముందు బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోతే స్కూలు పిల్లలే శ్రమదానము ద్వారా మట్టి వేసుకొని బస్సు వచ్చే రీతిగా చేసినారు .అయినా ఈ పది రోజులు అధిక వర్షాలకు బ్రిడ్జి పూర్తిగా మొత్తం కొట్టుకొని పాడైపోయినది వెంటనే బ్రిడ్జి వేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేయగలమని ఆయన హెచ్చరించినాడు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఉల్లిగయ్య మహబూబ్ ,కటికే బడే సాబ్ గ్రామ ప్రజలు ,రైతులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర6305950823