(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం లోని హల్వి గ్రామంలో నాడు నేడు పనులు చేస్తూండగా స్కూల్ బిల్డింగ్ పడిపోవడంతో స్కూల్ పిల్లలకు గాయాలు అయినావి విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి హల్వి గ్రామానికి చేరుకోని బాధితులను పరామర్శించి పదివేలు ఆర్థిక సహాయం చేశారు పాఠశాలను పరిశీలించి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూహాల్విలో నాడు-నేడు పన్నుల్లో నిర్లక్ష్యంతో గోడకూలి ఎనిమిది మంది పిల్లలు, టీచర్‍కు గాయాలయ్యాయి – పాత భవనం కూల్చుతున్నప్పుడు దానికి ఆనుకుని ఉన్న కొత్త భవనంలో పిల్లలను ఖాళీ చేయించాలని కనీస బాధ్యతలేని కాంట్రాక్టర్, అధికారులే ఈ ప్రమాదానికి బాధ్యులు – వైసీపీ సర్కారు నాడు-నేడు పన్నుల్లో దోపిడీపై పెట్టిన శ్రద్ధ.. పిల్లల ప్రాణాలపై లేకపోవడం విచారకరం అన్నారు.గాయాలు అయిన పిల్లలను ఆదుకోవాలని నాడు నేడు పనులు చేస్తూన్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికార్లు నిర్లక్ష్యము తోనే ఇది జరిగింది అన్నారు. 7 మంది విద్యార్థులకు ఒక టీచర్ కు గాయాలు అయ్యా. వీరికి హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, హల్వి మల్లప్ప గౌడ్, ఉసేని, శివప్ప గౌడ్, నరసింహులు,టి యన్ యస్ ఎఫ్ ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, భూంపల్లి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.