కొత్తపేట :. బిజెపి కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి సలాది రామకృష్ణ ఆధ్వర్యంలో వైసిపి ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి చేపడుతున్న “ప్రజాపోరుయాత్ర” కొత్తపేట మండలంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రి చిట్టిబాబు, యాత్ర జోనల్ ఇంఛార్జి గారపాటి తపనా చౌదరి,బిజెపి కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రజాపోరుయాత్ర ప్రారంభించారు ముందుగా నాయకులు కార్యకర్తలంతా సలాది రామకృష్ణ ఇంటివద్ద సమావేశమైప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు . ఈ సమావేశంలో అధికసంఖ్యలో జనం, మహిళలు హాజరయ్యారు ఈసందర్భంగా బిజెపినాయకులు మోదీసంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం రామకృష్ణ ఇంటివద్ద అల్పాహారం స్వీకరించి డిజె బాక్సులు ప్రచారరధంతో భారీ ర్యాలీగా ప్రజాపోరుయాత్ర ప్రారంభమైంది.ఈ యాత్ర పాతబస్టాండు సెంటర్ మరియు కమిరెడ్డిపాలెం , వాడపాలెం సెంటర్ వరకూ కొనసాగింది పలు ప్రధాన కూడళ్లలో వక్తలుగా విచ్చేసిన బిట్ర శివన్నారాయణ, కర్రి చిట్టిబాబు, తపనా చౌదరి, నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలకి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ స్టిక్కర్స్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు . ఆరోగ్యశ్రీ కి ఆయుష్మాన్ భారత్ ద్వారా, రైతు భరోసా కి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా, జగనన్న ఇళ్ళకి ఆవాస్ యోజన ద్వారా ఎక్కువ మొత్తంలో కేంద్రం నిధులుఇస్తుందని తెలిపారు.మరోవక్త బిట్ర శివన్నారాయణ వివిధ కూడళ్ళలో ఆకట్టు
కునే విధంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు.సహజవనరు ఇసుక ఉచితంగా అందించలేని అసమర్థ ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోయిందని ఇంకా అనేక విధాలుగా అవినీతిమయమై ఉచిత పంపకాల తో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ఈ అవినీతిపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో కుటుంబ పార్టీపాలన అంతమవ్వాలని ప్రతిఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీసంక్షేమ పథకాలు వివరించి 2024 లో బిజెపి రాష్ట్రంలో అధికారం దిశగా కృషి చేయా
లని ప్రజలంతా బిజెపి కి మద్దతు తెలపాలని కోరారు.ఈ కార్యక్రమంలో యాత్ర కో కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు, బిజెపి కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులుఇళ్ల దొరబాబు, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మహిళా మోర్చ జోనల్ ఇంఛార్జి చిట్టూరి రాజేశ్వరి, యాత్ర కో కన్వీనర్ పొనుగుపాటి శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కొవ్వూరి సీతారామిరెడ్డి ,బిజెపి కొత్తపేట మండల అధ్యక్షులు పాలాటి మాధవస్వామి, ఆలమూరు మండల అధ్యక్షులు నాగిరెడ్డి స్వామి, యువమోర్చ జిల్లా అధ్యక్షులు కటికిరెడ్డి గంగాధర్, యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాలాబత్తులచిన్నారి, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి, బిజెపి లీగల్ సెల్ నాయకులు అల్లుభాస్కరరావు, బిజెపి యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు