రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి కె. ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటిగా మండలంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు పొలంబడి కార్యక్రమం పై శిక్షణ ఇవ్వడం జరిగింది.తదుపరి గ్రామ రైతులకు పొలంబడి కార్యక్రమంలో పురుగు మందులు మానవునిపై ఎటువంటి విష ప్రభావం చూపుతాయో అవగాహన కల్పించి విచక్షణారహితంగా రసాయనకు పురుగు మందులు పిచికారి చేయడం వలన మనం పండించే ఉత్పత్తిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువ అవడం వలన అవి ఆహారంగా తీసుకునే వారిపై ప్రభావం ఏ విధంగా చూపుతున్నాయో వివరించడం జరిగింది. అంతేకాకుండా పెట్టుబడి ఖర్చు అధికమవుతుందని దీనివలన నికర ఆదాయం రైతుకు తగ్గుతుందని తెలిపారు. అందువలన అవసరం మేరకు మాత్రమే పురుగుమందులు ఉపయోగించాలని దీనివలన మిత్ర పురుగులను సంరక్షించుకోవడమే కాకుండా పర్యావరణం మన ఆరోగ్యం బాగుంటుందని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.తదుపరి పురుగులు ఉధృతి తెలుసుకోవడానికి లింగాకర్షణ బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు గురించి రైతులకు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం చిరు పొట్ట దశలో ఉన్నది కనుక కాండం తొలిచేపురుగు గురించి వాటి యొక్క జీవిత చరిత్ర నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది.తదుపరి రైతుల యొక్క చురుకుదనాన్ని ప్రేరేపించే విధంగా బృందవిన్యాసంలో భాగంగా బాలుతో ఆటలాడించడం జరిగింది. తదుపరి ప్రకృతి వ్యవసాయం గురించి ఐసిఆర్పి లక్ష్మణ్ మాట్లాడుతూ రసాయనిక పురుగు మందులు వాడకాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధంగా దొరికే వేప ఆకులతో నిమాస్త్రం తయారు చేసే విధానం మరియు అది ఎటువంటి పురుగుల నివారణకు ఉపయోగపడుతుందో వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు సూరిబాబు, ఉప సర్పంచ్ లక్ష్మణరావు, గ్రామ నాయకులు వెంకటేశ్వరరావు రైతులు చిన్నబ్బు ఇతరు రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు అజయ్, శివశంకర్, సాయిరాం పాల్గొన్నారు
కూర్మాపురం లో వ్యవసాయ శాఖ పొలంబడి
RELATED ARTICLES