ఆంధ్రన్యూస్ : కిర్లంపూడి కాకినాడ జిల్లా : సీనియర్ రాజకీయ నాయకులు మరియు గాంధేయవాది, దళిత జాతి ముద్దుబిడ్డ అయినా శ్రీ గుడాల చిట్టిబాబు గారి 11వ,వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మండల కేంద్రం కిర్లంపూడి లో ఉన్న హరిజన పేటలో నెలకొల్పిన కీర్తిశేషులు గుడాల చిట్టిబాబు గారి విగ్రహం వద్ద ఆయన కుమారులు వారి కోడలైన ప్రత్తిపాడు కిర్లంపూడి గ్రామ సర్పంచులు గుడాల శ్రీలత రాంబాబు దంపతులు అదేవిధంగా గుడాల శ్రీ విజయలక్ష్మి వెంకటరత్నం దంపతుల చేతుల మీదుగా కీర్తిశేషులు చిట్టి బాబు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. శతాధిక వృద్ధుడు అయిన కీర్తిశేషులు గుడాల చిట్టిబాబు స్వాతంత్ర ఉద్యమ అనంతరం ఆయన బాల్యం నుండి విద్యార్థిల హక్కుల గురించి ఆయన చదువుకున్న పాఠశాలలో పోరాడిన తీరు అమోఘమని అదేవిధంగా పేదరికంలో మగ్గుతున్న వెనుకబడిన కులాల వారికి దళితజాతి చిన్నారులకు చదువుకునేందుకు వీలుగా సామాజిక హాస్టళ్లను నెలకొల్పేందుకు గుడాల చిట్టి బాబు చేసిన కృషి ఎనలేనిదని ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా విద్యార్థి నాయకుడిగా నిలదొక్కుకుంటూ అప్పటి జమిందారీ రాజకీయాల్లో కూడా చిట్టిబాబు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని సమాజంలో దళితులు కున్న గౌరవాన్ని వారి యొక్క విలువలను హక్కులను చాటి చెప్పేందుకు ఆయన ఎంతగానో పాటుపడి ముందుకు సాగారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి కావడం వల్లే స్వర్గీయ గుడాల చిట్టిబాబు కు తన సామాజిక వర్గమైన దళితుల్లోనే కాకుండా పొరుగు సామాజిక వర్గాల్లో కూడా ఆయన తలలో నాలుకలా మెలుగుతూ ఆయనకంటూ ఆయా సామాజిక వర్గాల్లో ఒక మార్కు వేసుకున్న సంగతి కూడా అందరికీ తెలియనిది కాదు. అందుచేతే ఈరోజుకి కూడా కిర్లంపూడి మండలం లోనే కాదు పొరుగు మండలాల్లో కూడా ఆయనకున్న పేరుప్రఖ్యాతులు అంచనావెయ్యి లేనివని పలువురు ఇప్పటికీ అంటుంటారు. ఆ నేపథ్యంలోనే గుడాల చిట్టిబాబు స్వగ్రామమైన కిర్లంపూడి లో ఆయన పెద్ద కుమారుడు భార్య అయినా గుడాల శ్రీలత రాంబాబు జగపతినగరం గ్రామ సర్పంచిగా ఎన్నికై తే చిట్టిబాబు రెండో కుమారుడు భార్య అయినా గుడాల శ్రీ విజయలక్ష్మి వెంకటరత్నం దంపతులను నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు గ్రామానికే గ్రామ సర్పంచిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇలా ఒకే ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముల భార్యలు రెండు మండలాల్లో వేరువేరుగా వేరు వేరు పార్టీల తరఫున పంచాయతీ గ్రామ సర్పంచులు గా ఎన్నికయ్యారు అంటే ఆయా మండలాల్లో కీర్తిశేషులు దళిత బాందవుడైన గుడాల చిట్టిబాబు కున్న చరిష్మా ఏమిటో ప్రజలందరికీ ఇట్టే అర్థం అవుతుంది. అందుచేత నేటి యువత తో పాటు దళిత యువకులందరూ చిట్టిబాబు జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయసాధనకు ముందుకు సాగాలని పలువురు కోరుతున్నారు.
కిర్లంపూడి లో దళితజాతి ముద్దుబిడ్డ శ్రీ గుడాల చిట్టిబాబు వర్ధంతి వేడుకలు.
RELATED ARTICLES