Sunday, January 29, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాకార్యకర్తలు ఎవరిని మరిచేది లేదు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

కార్యకర్తలు ఎవరిని మరిచేది లేదు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

ఆంధ్రన్యూస్ : కిర్లంపూడి. నియోజకవర్గంలో తన గెలుపునకు కృషి చేయడంతో పాటు వైయస్సార్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్న కార్యకర్తలు ఎవరిని మరిచేది లేదని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు వివరించారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో వైయస్సార్ పార్టీలో కష్టించి పనిచేసిన కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం కన్వీనర్ల గా నియమకాలు చేపట్టిన నేపథ్యంలో వారికి ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే చంటిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు అండగా నిలబడి తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఉత్సాహంగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి గ్రామ కమిటీ బాధ్యతలతో పాటు కన్వీనర్లుగా కూడా నియమించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే చాలామంది నిరుద్యోగులను పార్టీలకతీతంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామాల్లో ప్రభుత్వo అమలు చేస్తున్న సంక్షేమాలను ప్రజలకు దరి చేర్చాలన్న ఆలోచనతో గ్రామ వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుండే కార్యకర్తలందరూ యుద్ధంలో పాల్గొన్న సైనికుల మాదిరిగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఎమ్మెల్యే చంటిబాబు ఆదేశించారు. కార్యకర్తల్లో అక్కడక్కడ చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులను కూడా త్వరలోనే సంబంధిత నాయకులను కార్యకర్తలను కూర్చొoడ పెట్టి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్నామని చంటిబాబు మీడియా ద్వారా వివరించారు. దయచేసి పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు ఆదిపత్యాలకు పోకుండా నియోజకవర్గంలో మంచి సుపరిపాలన అందించేందుకు అడుగులు వేయాలని ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా పార్టీ విజయానికి ఆది నుండి ఎంతో ముఖ్య భూమిక పోషించిన నియోజకవర్గ సీనియర్ నాయకుడైన జనపరెడ్డి సుబ్బారావు అనే కొత్తపల్లి బాబునీ మరోసారి జగ్గంపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలను కట్ట పెట్టడం వల్ల బుధవారం ఉదయం నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ కార్యక్రమానికి సంబంధిత మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి హాజరవుతున్నందున ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు నియోజకవర్గ ప్రజలతో పాటు వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులందరూ జగ్గంపేట కి తరలి రావాలని ఎమ్మెల్యే చంటిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి జగ్గంపేట ఎంపీపీలు తోటరవి, అత్తలూరి నాగబాబు, జడ్పిటిసి ఒమ్మి బిందుమాధవి, రాష్ట్ర డైరెక్టర్లు ఇళ్ల అప్పారావుకాపు, మొల్లేటి సరస్వతి, బిళ్లకుర్తి నాగమణి, సంగన సూర్యకుమారి, అదేవిధంగా నియోజవర్గ సీనియర్ నాయకులు పెంటకోట నాగబాబు, చదలవాడ బాబి, దోమాల గంగాధర్, బొడ్డేటి గణపతి, శెట్టి సోమరాజు, కంచుమర్తి రాఘవ, పాము సూరిబాబు, యల్లపు నానాజీ, రాపేటి ప్రసాద్, పెనగంటి రాజేష్, అల్లు శివరామకృష్ణ, తోట అయ్యన్న, కిర్లంపూడి మండల నాయకులు ఆడారి మహేష్, పీలా లోవసుబ్రహ్మణ్యం, ఆడారి గంగబాబు, దాడి అప్పలరాజు, యల్లపు శివ, సిగటాపు కృష్ణారావు, ఆళ్ల రామ శివ, మరిసే రాంబాబు, అంబటి బుజ్జమ్మ, బండారు ప్రసాద్, లంక మూర్తి, సరిసే శివకుమార్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments