కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య అన్నారు. కర్నూల్, నంద్యాల ,అనంతపురం ఈ మూడు జిల్లాల్లో కల్తీ పత్తి విత్తనాల వల్ల అకాల వర్షాల వల్ల దాదాపు లక్షలాది ఎకరాలలో పంటలు దెబ్బతిని రైతులు పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కల్తీ పత్తి విత్తనాల వల్ల ఎకరాకి 50 కేజీలు ,ఒక క్వింటాలకు మించి పత్తి దిగుబడి రాలేదు. అధిక వర్షాలు కావడం వల్ల వరి ఎకరాకి 40 బస్తాలు రావాల్సి ఉండగా ,20 ,25 బస్తాలు వచ్చినాయి. మిరపైతే ఎకరాకి అధిక వర్షాలు తెగుళ్లు వల్ల ఒక క్వింటాలు కూడా రాని పరిస్థితి ఏర్పడినది. వేరుశనగ, ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోయినారు అన్నారు. కే మల్లయ్య మాట్లాడుతూ పూర్తిగా నష్టపోయిన టు వంటి రైతుల్ని ఆదుకొని ఎకరాకి 60 వేల రూపాయలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మూడు జిల్లాల రైతులు వస్తున్నారు ,మన మండలం నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం ఇచ్చేంతవరకు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపు ఇవ్వడం అయినది.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశులు, మేలిగిరి ఈరన్న, ఉల్లిగయ్య ,వలి ,వెంకన్న ,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం (ఆంధ్రన్యూస్) రిపోర్టర్ వీరభద్ర