మంత్రాలయం (ఆంధ్రన్యూస్)
మంగళవారం మండల పరిధిలోని మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. గాంధీజీ, సరస్వతి చిత్రపటాలకు పూలమాలలు వేసి నమస్కరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయి లో పోటి పడేలా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష తో డిజిటల్ విద్య లో భాగంగా ట్యాబ్ లు అందజేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థి వీటిని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను దేశ స్థాయిలో చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ భాస్కర్, ఎస్ఐలు వేణు గోపాల్ రాజ్, కిరణ్ బాబు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, జడ్పీటీసీ మజ్జిగ గోవిందమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఇందిరమ్మ, ఎంపీటీసీ సభ్యులు ఈరన్న నాయకులు రొగప్ప, బొజ్జప్ప, రవి రెడ్డి, శ్రీనివాసులు, జగన్నాథ్, భీమిరెడ్డి, మండల విద్యాధికారి మోహనుద్దీన్, హెచ్ఎం లతిఫ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.