కిర్లంపూడి. కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా నేపథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా పాలకవర్గ సభ్యులు అందరూ ఘనంగా చేపట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయంగా ఎంతో క్రియాశీలకంగా ఉన్న ఈ మండలంలో వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాడాన్ని మండల ప్రజా ప్రతినిధులు అందరూ సగర్వంగా ఫీల్ అయ్యారు. అందులో భాగంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడైన తోట రవి స్థానిక వైయస్సార్ పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన వన్ ఇయర్ సెలబ్రేట్ కేకునీ తన చేతుల మీదగా కట్ చేసి ఎంపీటీసీ సభ్యులకు అక్కడే ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు,గ్రామ సర్పంచు లకు తినిపించారు. అనంతరం వన్ ఇయర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఎంపీపీ ని ఎంపీటీసీ సభ్యులను మండల నాయకులు అయిన పెంటకోట నాగబాబు, అల్లు విజయ్ కుమార్, తోట గాంధీ, తోట విష్ణుమూర్తి వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి ల చేతుల మీదగా పూలమాలవేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ కిర్లంపూడి మండల పాలక వర్గంగా ఎంపికైన తమకి తమ అభిమాన నాయకుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అందిస్తున్న సహాయ సహకారాలు తాము ఎన్నటికి మరువలేమని అన్నారు. ఆయన తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని సమన్వయపరచికుంటూ రాబోయే ఎన్నికలకు ముందుకు సాగుతామని ఎంపీపీ వివరించారు. అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరితోపాటు పాలకవర్గ సభ్యులను అలాగే ప్రభుత్వ శాఖల అధికారులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్న కిర్లంపూడి మండల పాలకవర్గానికి అన్ని సమయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలోనే మండలాన్ని ఆదర్శంగా నిలిపేందుకు పార్టీలకతీతంగా కలుపుకుపోవాలని ఎంపీపీ కి నాగబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ డైరెక్టర్లు బిళ్లకుర్తి శివాజీ, సంగన వెంకటేశ్వరరావు, మొల్లేటి వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు రాపేటి ప్రసాద్, గరగా గోవిందు, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల రామశివ, అలాగే స్థానిక నాయకులు మల్ల నాగబాబు, పెనగంటి రాజేష్, వేగి రామకృష్ణ, శరకణం సంతోష్, యల్లపు నానాజీ, నక్కా అప్పలరాజు, ఆడారి మహేష్, పీలా లోవసుబ్రహ్మణ్యం, ఆడారి గంగబాబు, బొజ్జపు శ్రీను, D.S.N రాజు, ఆళ్ల బాబులు, దాడి అప్పలరాజు, సరిసే అప్పలసామి, శరకణం సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.