ఏలేశ్వరం: దళిత గిరిజన సమస్యలు పరిష్కారానికి నిర్ణయ అధికారం కలిగిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరంలో దళిత ప్రజాశక్తి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మురారి రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నియామకాల్లో కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుని మెట్ట ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కేవలం కాకినాడకు చెందిన వారిని నియమించారని ప్రత్తిపాడు తుని పిఠాపురం నియోజకవర్గాల శాసనసభ్యులు సిఫార్సు చేసిన వారిని కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. వెంటనే కమిటీని రద్దుచేసి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నూతన మానిటరింగ్ కమిటీ నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని దళిత సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు . ఈ నిరసన కార్యక్రమంలో పట్ట నూకరాజు, పేకల జాన్, మద్దెల రమణ, ఎస్ జాన్ మోరంపూడి బంగారు రాజు తదితరులు ఉన్నారు.