కౌతాళం (ఆంధ్ర న్యూస్)అక్టోబర్ 15
ఈరోజు కౌతాళం మండల పరిధిలో ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది కర్ణాటక రాష్ట్రం సిరిగుబ్బ తాలూకా మురవని గ్రామం నుండి అక్రమంగా కర్ణాటక మద్యం ను కౌతాళం మండలం ఉరుకుంద గ్రామానికి తరలిస్తున్న బంట కుంట గ్రామానికి చెందిన ఈడిగ రాజశేఖర్, ఈడిగ వీరాంజనేయలు ను మరియు సరుకు తీసుకున్న సారాయి ఈరన్న లను పట్టుకుని వారి వద్ద నుండి 12 బాక్స్ లు, ఒక మోటార్ సైకిల్ లను సీజ్ చేసి రిమాండ్ కి పంపడమైనది.
ఎవరైనా గ్రామాలలో అక్రమ మద్యం అమ్మినా సరఫరా చేసినా జైలు శిక్ష తప్పదు. కాబట్టి గ్రామాలలో ఎవరైనా మద్యం అమ్మితే మరియు సరఫరా చెస్తే కఠిన చర్యలు తీసుకుంటాము.
ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్ది, మాటలాడుతూ ఎవరైనా గ్రామములో మద్యం క్రమ రవాణా విక్రయాలకు పాలపడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823