ఉపాధి పనులపై అవగాహన సదస్సు..
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు పై ఏ పీ ఓ రామచందర్రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎన్ ఆర్ఇజిఎస్ పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందని, కూలీలందరూ ఉదయం 6 గంటలకు పనికి హాజరై 11 గంటల వరకు పని చేయాలని, మేట్లు అందరూ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలని, పనికి వచ్చిన వారందరికీ ప్రారంభానికి ముందు ఒక సారి, పని అనంతరం రెండు ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాలని, మస్టర్ కూడా యాప్ ద్వారా పంపించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయగలిగితే రోజుకు 257 రూపాయలు కూలి వస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మేట్లు పనులు పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. డిమాండ్ ఫారంలో పేరు నమోదు చేసి పనికి రాకపోతే 100 రోజుల పనిలో నష్టపోతారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, సర్పంచ్ గరి సింగు శివలక్ష్మి దొరబాబు, టెక్నికల్ అసిస్టెంట్ శివ, ఫీల్డ్ అసిస్టెంట్ శివ తదితరులు పాల్గొన్నారు.