ఇదేం కర్మ మన రాష్ట్రానికి రచ్చబండ కార్యక్రమం.
ఆంధ్ర న్యూస్ కోటనందూరు
కాకినాడ జిల్లా, కోటనందూరు మండలం, కేవో అగ్రహారం గ్రామంలో తుని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల కృష్ణుడు “”ఇదేం కర్మ మన రాష్ట్రానికి” రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా గ్రామ వీధులలో ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్య పరుస్తూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరిచారు. అనంతరము రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రైతులు ఉద్యోగస్తులు మధ్య పేద తరగతి కుటుంబాలు సుఖముగా బ్రతకడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు పనిముట్లు ఇచ్చారని అన్నారు. దళితుల 27 పథకాలు రద్దుచేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూములను బలవంతాన్న లాక్కుంటున్నారన్నారు. నిత్యవసర ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని క్రిస్మస్ కానుకలు పెండ్లి కానుకలు రద్దు చేశారని, రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే రాబోయే రోజులలో అందరూ చైతన్యవంతులై తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు, మాజీ ఎంపీపీ డి చిరంజీవి రాజు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్, మండల టిడిపి ఉపాధ్యక్షులు పెనుముచ్చు నాగేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.