కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం కౌతాళం గ్రామం లోని ప్రజలకు సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అన్నారు. మంత్రాలయ శాసనసభ్యులు వై బాలనాగరెడ్డి ఆదేశాల మేరకు దేశాయిప్రహ్లాద ఆచారి మరియు సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ప్రకారం, గ్రామంలో అమలులో ఉన్న ఉపాధి హామీ పనులకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి ఆర్థిక సంవత్సరములో కనిష్ట వంద రోజులు వేతన ఉపాధిని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధి భద్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం గ్రామంలో ప్రజలు పాల్గోని వలస కు మరో రాష్ట్రనికి వెళ్ళకుండా గ్రామ అభవృద్ది కీ సహకరించాలని కోరారు. ఈ ఎంపీపీ బుజ్జి స్వామి. హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న. కార్యక్రమంలో ఉప సర్పంచ్. సక్కరి తిక్కయ ,జుబిర్ అహ్మద్ (ఏ పీ ఓ), టి. ఖాదర్ బాషా ( ఈ. సి), లింగన్న (ఫీల్డ్ అసిస్టెంట్లు) తదితరులు పాల్గొన్నారు.