కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 05 కౌతాళo మండలం చాలా గ్రామాల్లో అఖీరా తడాఖా వేసిన పత్తి రైతులు నట్టేట మునిగిపోయినారని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశులు జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య మాట్లాడుతూ
ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో ఉప్పరహల్ గ్రామంలో పొలాల్లో పర్యటించి ఆ గ్రామంలో 550 నుంచి 600 ఎకరాల వరకు పత్తి అకిరవేసి నష్టపోయినామని రైతు సంఘం నాయకుల ముందు వాళ్ళ గోడను వెలిబుచ్చినారు. ఒక్కొక్క రైతు 20 ఎకరాలు ,30 ఎకరాలు, 40 ఎకరాల వరకు అకిర విత్తనాలు వేసి పూర్తిగా నష్టపోయినమని ఒక ఎకరాకి 40 వేల రూపాయలు ఖర్చు చేసినా ఇప్పటికీ 10 కేజీలు కూడా పత్తి రాలేదని అన్నారు. ఆ విత్తనాలు స్థానిక వ్యాపారస్తుల దగ్గర ఆదోనిలో విత్తనాలు కొన్నామని రైతులు కన్నీరుతో వాపోయినరు. రమేష్ ,బీరప్ప ,మారెప్ప, మహాదేవప్ప, పెద్ద లింగన్న, బోయ పంపాపతి ,బోయ ఉసేని తదితర రైతుల పొలాలను రైతు సంఘం నాయకులు పర్యటించడం జరిగింది.
స్థానికంగా ఆర్థిక కేంద్రాలు ఉన్న రైతులు యొక్క వ్యవసాయ స్థితిగతుల గురించి ఏమాత్రం ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు ఈ స్థితికి దిగజారడం అయినది అని రైతు సంఘం నాయకులు అన్నారు.
ఈ బృందంలో రైతు సంఘం మండల కార్యదర్శి మేలిగిరి ఈరన్న, మండల నాయకులు వెంకటేశులు ,నర్సింహులు, రంగప్ప ,హుసేని ,మారెప్ప తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823