ఆంధ్రన్యూస్ : అన్నవరం కొండపై వివిద విభాగాల్లో పని చేస్తున్న NMR. సిబ్బంది కి దేవాదాయశాఖ పిఆర్సి ప్రకటించిన అది అమల పరిచేందుకు కొండపై కొంత మంది పెద్దలు, ప్రముఖులకు బిల్లు చేసేందుకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారన్న వార్తలు గత కొద్ది కాలం వైరల్ గా అయ్యాయి అన్న విషయం అందరికి తెలిసినదే, దాంతో వాళ్లకు PRC అమల పరుస్తున్నట్లు దేవస్తానం ప్రకటించింది.
అయితే జనవరి నెల నుండి ఈ PRC అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించిన యడాది పాటు రావాల్సిన ఏరియర్స్ కు మళ్ళీ కొంత మంది అడ్డుకట్ట వేస్తున్నట్లు సమాచారం. ఇది మా చేతుల్లో పని దానిని అమలు పరచాలంటే మనిషి 5 వేలు చొప్పున సుమారు 6 లక్షల రూపాయల లంచం చెల్లించే వరుకు అమలు కాదని తెగేసి చెప్పి నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
దాంతో కొంత మంది వసూళ్లు కు శ్రీకారం చుట్టినట్లు సమాచారం….
అసలే వచ్చేదే పండగ ఎలా చూసిన మనిషికి యరియల్స్ రూపంలో దాదాపు 70 వేలు వరుకు వస్తాయి, 5 వేలు ఇస్తే తప్పు ఏమిటి అని కుంటి సాకులు చెప్పి మరి వసూలు చేస్తున్నాట్టు గుసగుసలు వినబడుతున్నాయి. వసూలు చేసిన సుమారు 6 లక్షల నగదు ఎవరెవరి ఖాతాలోకి వెళుతుందో పూర్తి వివరాలు ఆధారాలతో అతి త్వరలో…
పడాల నాగు. 9494944868