కౌతాళం, అక్టోబర్ 08( ఆంధ్ర న్యూస్)
ఆదోని డీఎస్పీ కె. వినోద్ కుమార్ ఆద్వర్యంలో, కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎరిసా వలి మరియు టి. నరేంద్ర కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు,మరియు కౌతాళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ముద్దాయిలు దొంగలించిన 21 మోటార్ సైకిల్స్ ను రికవరీ చేసినారు.
సీజ్ చేసిన 21 మోటార్ సైకిల్స్ యొక్క విలువ సుమారు : 14,00,000/-
ముద్దాయిలు పేర్లు వివరాలు :
1. బసవ రాజు S/0 ఈరన్న, వయస్సు 26 సం||, రౌడూర్ గ్రామం,
2. అర్లబండ దుర్గయ్య వయస్సు 20 సం ||, తండ్రి అర్లబండ యాంకన్న గోతులదొడ్డి గ్రామం,
3. తునకాల. మంతెష్ వయసు 22 సం||, తండ్రి తునకాల నాగి రెడ్డి గోతులదొడ్డి గ్రామం కౌతాళం మండలం
ముద్దాయిలు దొంగతనాలు గత రెండు నెలల కాలము నుండి ఆంధ్ర ప్రదేశ్ , కర్నాటక, మరియు తెలంగాణ రాష్ట్రములలో మోటార్ సైకిల్స్ లు దొంగతనము చేయడం జరిగింది.
నేరములు జరిగిన పరిధి :-
(మొత్తం 21 బైక్ లు) కౌతాళం పోలీస్ స్టేషన్ పరిదిలో – 03, అనంతపూర్ టౌన్ పరిదిలో – 02 రాయచూర్ టౌన్ పరిదిలో – 07 , హైదరాబాదు సిటి పరిధిలో – 09.
ముద్దాయిలును అరెస్ట్ చేసిన ప్రదేశం బాపురం చెక్ పోస్ట్, కౌతాళం మండలము, కర్నూల్ జిల్లా.
నేరము :- ముద్దాయిలు ముగ్గురు కౌతాళం మండలము కు చెందిన రౌడూర్ గ్రామము మరియు గోతులదొడ్డి గ్రామము లకు చెందిన వారు. వీరు ముగ్గురు స్నేహితులు. వారు ముగ్గురు కూడా బెల్దార్ పని కూలి పనులు చేసుకుంటూ జీవనము సాగిస్తూ ఉంటారు. సదరు ముగ్గురు ముద్దాయి లు మద్యమునకు మరియు జల్సాలకు అలవాటు పడి, వారికి పనులు చేసుకోవడం వలన వచ్చు డబ్బులు వారి జల్సాలకు సరిపోకపోవడము వలన డబ్బులు కొరకు ఏదైనా దొంగతనములు చేయాలి అని అనుకుని ముగ్గురు కలసి బైక్ తాళాలు సేకరించుకొని వీరు బెల్దార్ పని చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా మోటార్ సైకల్ లు దొంగతనము చేసేవారు. వీరు సుమారు 2 నెలల నుండి దొంగతనం చేయడం మొదలు పెట్టి ఇప్పటి వరకు అనగా 04.10.2022 వరకు 21 మోటార్ సైకిల్స్ ను దొంగతనాలు చేసినారు. వాటి వివరములు వరుసగా “ రాయచూర్ నందు -07, హైదరబాదు నందు – 09, అనంతపూర్ నందు -02, కౌతాళం మండలము ఉరుకుంద గ్రామము నందు- 03 చొప్పున మొత్తం పై 21 వివిధ రకాల మోటార్ సైకిల్స్ ను పలు దఫాలుగా దొంగలించి సదరు ముద్దాయిలు మోటార్ సైకల్ లను రౌడూర్ గ్రామములో ముద్దాయి బసవ రాజు రేకుల షేడ్డు లో దాచి ఉంచి, ఒక్కొకరు 07 మోటార్ సైకల్ చొప్పున పంచుకొని వాటిని అమ్మి ఆ డబ్బులు ను ముగ్గురు పంచుకొని వారి యొక్క అవసరాలు వాడుకొనుటకు ప్లాన్ చేసినారు.
అంతట కౌతాళం ఎస్సై టి. నరేంద్ర కుమార్ రెడ్డికి వచ్చిన గోప్యమైన సమాచారం మేరకు మధ్యవర్తులను తీసుకొని వెళ్లి ఈ రోజు అనగా 08.10.2022 వ తేదిన బాపురం చెక్ పోస్ట్ వద్ద ఎస్సై మరియు వారి సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో వాహనంలు తనిఖీ చేస్తుండగా సదరు ముద్దాయిలు ముగ్గురు మూడు మోటార్ సైకల్ ల పై హాచోళ్ళీ వైపు వెళ్తూ పోలీస్ వారు చేసున్న వాహన తనిఖీలను చూసి వారు వస్తున్న మోటార్ సైకిల్ లను వెనుకకు తిప్పుకొని పారిపోవుతుండగా పోలీస్ వారు ముద్దాయిలను పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో విడివిడిగా విదారించగా వారు ముగ్గురు పై విధంగా నేరం ఒప్పుకొన్నందున వారు ముగ్గురిని అరెస్ట్ చేసి వారు దొంగతనం చేసి దాచి ఉంచిన 21 మోటార్ సైకిల్ ను వారు దాచి ఉంచిన ప్రదేశం నుండి తీసి చూపిoచినారు. .
సదరు పై 21 మోటార్ సైకిల్స్ ఆధారములను బట్టి వివరాలు సేకరించి 3 రాష్ట్రాలలోని సంబందించిన పోలీసు స్టేషన్ లకు సమాచారం పంపించి బాదితులకు న్యాయం చేయడం జరుగుతుంది.
మోటార్ సైకిల్స్ వివరాలు :- హోండా షైన్ – 06, హోండా యునికార్న్ 5, హీరో ప్యాషన్ ప్రొ – 05, హీరో HF డీలక్స్ 03, హీరో హోండా స్పలెండర్ ప్లస్ – 01, హోండా డ్రీం యుగ 01.
పై మోటార్ సైకిల్స్ దొంగతనం రికవరీ కేసు ను ప్రత్యక్షం గా పర్యేవేక్షించిన ఆదోని సబ్ డివిజన్, డీస్పీ అయిన కె. వినోద్ కుమార్ యొక్క దర్యాప్తు బృందం :
1) శ్రీ ఎరిసా వలి, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ కోసిగి రూరల్ పోలీస్ 2) టి. నరేంద్ర కుమార్ రెడ్డి , సబ్- ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ కౌతాళం పోలీస్ స్టేషన్ సిబ్బంధి :- ఏ ఎస్ ఐ మహబూబ్ బాష, మద్దిలేటి, హుస్సైన్ బాష, వీరేష్, వీరాంజీ, వీర భాస్కర్, అశోక్, మరియు మోహన్ రాజ్.
అంతర్ రాష్ట్ర మోటార్ సైకల్ దొంగతనము కేసులను చాక చక్యముగా ఛేదించి 21 మోటార్ సైకల్ లను రికవరీ చేసినందులకు గాను కర్నూల్ జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ మరియు డీఎస్పీ వినోద్ కుమార్ ధర్యాప్తు బృందాన్ని ప్రత్యేకముగా అభినందించినారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823